కర్నూలు బ్యూరో : గుంతకల్లు పట్టణ శివారులో ఈరోజు (ఆదివారం) దారుణ ఘటన చోటు చేసుకుంది. కర్నూలు జిల్లా, ఆలూరు కాంగ్రెస్ నేత, ఏపి ఎమ్మార్పీఎస్, రాయలసీమ జిల్లాల అధ్యక్షుడు చిప్పగిరి లక్ష్మీనారాయణను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు.
లక్ష్మీనారాయణ ప్రయాణిస్తున్న కారును టిప్పర్ తో ఢీ కొట్టి హత్య చేసినట్లు సమాచారం. స్థానికులు ఆయనను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటన స్థలం చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.