అఖిలాండ కోటి సేవలో పొట్లపల్లి..

అఖిలాండ కోటి సేవలో పొట్లపల్లి..
మినీ తిరుపతిగా చిలుపూర్ బుగులు వెంకన్న ఆలయం
వరుసగా నాలుగుసార్లు ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా విశిష్ట సేవలు
అభివృద్ధికి కేరాఫ్ శ్రీధర్ రావు..
ఎమ్మెల్యే సహకారంతో దేవస్థాన డెవలప్మెంట్ కు నూతన దిక్సూచి
సొంత నిధులు రూ.కోటితో ఆలయ అభివృద్ధికి పొట్లపల్లి కృషి
రానున్న రోజుల్లో రూ.5కోట్లతో అభివృద్ధికి మాస్టర్ ప్లాన్
శ్రీధర్ రావు సేవలను కొనియాడుతున్న భక్తులు
కొనసాగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలు
స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : దేవాలయం అంటే అంటే కేవలం పూజలు, అక్కడ నిర్మాణాలు కాదు.. భక్తజన సంకల్పం, సేవా తపన కలిసిన పుణ్య ఫలితమే..అందుకు అద్భుత ఉదాహరణ జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ పరిధిలోని చిలుపూర్ బుగులు వేంకటేశ్వర స్వామి ట్రస్ట్ బోర్టు చైర్మన్ శ్రీధర్ రావు..వరుసగా నాలుగు సార్లు చైర్మన్ గా ఎన్నికైన ఆయన సొంత డబ్బులు దాదాపు కోటి రూపాయలు వెచ్చించి దేవాలయ అభి వృద్ధికి అహర్నిశలు కృషి చేసిన ఆయన సేవా భావాన్ని భక్తులు కొని యాడుతున్నారు. శ్రీధర్ రావుతోనే రాష్ట్రంలోనే ఆలయం ప్రసిద్ధిగా గుర్తింపు పొందిందని భక్తులు వేనేళ్ల పొగుడుతున్నారు.
ప్రజాప్రతినిధు లు, నాయకుల మద్దతు, అధికారులతో కలిసి దేవస్థానం వేగంగా అభి వృద్ధి దిశగా పయనిస్తోంది. ఎమ్మెల్యే కడియం శ్రీహరి నాయకత్వం, చైర్మన్ శ్రీధర్ రావు పట్టుదల, ఈవో నిబద్ధత..ఈ ముగ్గురి సమన్వయం తో దేవస్థానం ఒక ఆదర్శ ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకుంటోందని భక్తులు నమ్ముతున్నారు. స్వామివారి భక్తులకు సౌకర్యాల కల్పన, రహ దారి సదుపాయాలు, ఆధ్యాత్మిక సేవలు, పరిశుభ్రత, ముఖ్యంగా స్వామి వారి ఆలయ భూముల సంరక్షణ కోసం చూపుతున్న శ్రద్ధ..ట్రస్ట్ బోర్డు ప్రత్యేక కృషితో వెంకన్న దేవస్థానం త్వరలో మరింత మహిమాన్వి తంగా నిలవనుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. కాగా 23న తొలక్కంతో ప్రారంభమైంది. మార్చి 2వ తేదీన ఉత్సవ మూర్తుల చక్రస్నానం, పండిత ఆశీర్వాదముతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
మహత్తర నిర్ణయాలు:

ఆలయానికి ఉత్తర భాగంలో ఎత్తుగా ఉన్న కొండను స్థపతి సూచనల మేరకు రూ.20లక్షలతో (బండరాళ్ళు) తొలచివేయించారు. కింది భాగం లో రూ.10లక్షలతో అర్ధాంతరంగా నిలిచిపోయిన కాలక్షేప మండపం నిర్మాణం చేసి భక్తులకు నీడ, విశ్రాంతి సౌకర్యం కల్పించారు. కొండపై వెలసిన స్వామి గృహం వరకు 580మెట్ల మార్గాన్ని నిర్మించారు. రాజగో పురం తూర్పు భాగంలో మెట్ల నిర్మాణం, గ్రానైట్ ఫ్లోరింగ్ పనులకు రూ.10 లక్షలు వెచ్చించి పనులు పూర్తి చేశారు. ఆలయ రాజగోపురం తో పాటు ఆర్చీ, మెట్లకు పంచరంగులు వేయడానికి రూ.8లక్షలు ఖర్చు చేశారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గుట్ట దిగువన తాగునీటి సౌకర్యార్థం బోర్‌వెల్, మోటార్ పైప్ లైన్‌ను రూ.1.50 లక్షల వ్యయంతో ఏర్పాటు చేశారు. అదేవిధంగా సీసీ రోడ్లు, వాహనాల పార్కింగ్ వంటి అనేక సదుపాయాలను కూడా నిర్మించారు.
ఆధ్యాత్మిక పునరుజ్జీవనానికి శ్రీధర్ రావు శ్రీకారం:
ప్రతి సంవత్సరం దేవస్థానంలో అంగరంగ వైభవంగా కల్యాణ మహోత్స వాలు జరిగేలా శ్రీధర్ రావు స్థిరమైన కళ్యాణ మండపాన్ని నిర్మించి మరింత ప్రతిష్టను పెంచారు. మంగళవారం అష్టదళ పాద పద్మారాధన ను 108బంగారు పూలతో నిర్వహించే ఆధ్యాత్మిక సేవను ప్రారంభించా రు. శనివారం వార కళ్యాణం అన్నదాన కార్యక్రమాలను నిర్వహించి భక్తులకు సేవలను మరింత విస్తరించారు. ప్రతి సంవత్సరం కొత్తగా దానంగా స్వామి చిత్ర పటాలను భక్తులకు బహూకరించడం వంటి ఆధ్యాత్మిక పునరుజ్జీవన కార్యక్రమాలకు శ్రీధర్ రావు శ్రీకారం చుట్టారు.
సుందరీకరణతో కళకళలాడుతున్న దేవస్థానం:
దేవస్థానం చుట్టుపక్కల ప్రాంతాలను మట్టితో చదును చేసి ఆలయాన్ని శ్రీధర్ రావు మరింత సుందరంగా చేశారు. భక్తులు సేదదీరేందుకు చెట్ల కింద తన తండ్రి తెలంగాణ ఉద్యమకారుడు చక్రధర్ రావు స్మారకర్ధం గా బెంచీలు, గద్దెలు ఏర్పాటుకు కృషి చేశారు. రాత్రి వేళల్లో ఆలయం దేదీప్యమానంగా వెలుగొందేలా అద్భుతమైన లైటింగ్ వ్యవస్థ అమలు చేయడం వంటి కార్యక్రమాల ద్వారా దేవస్థానం మరింత ఆహ్లాదకరంగా మారిందని భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఎమ్మెల్యే సహకారంతో 14ఎకరాల భూములు రక్షణ:

ముఖ్యంగా దేవస్థానం భూములను గుర్తించి, వాటిని వెలికి తీసి, సర్వే చేయించి ఆక్రమణలదారుల నుండి కాపాడటం వంటి సాహోసోపేత చర్యలు చేపట్టారు. ప్రధానంగా ఎమ్మెల్యే కడియం సహకారంతో 14 ఎక రాల 20గుంటల భూములు గుర్తించి వాటిని రక్షించారు. స్వామి వారి ఆదాయాన్ని పెంచి భక్తులకు సకల సౌకర్యాలు కల్పించేందుకు శ్రీధర్ రావు విషేశ కృషి చేస్తున్నారు. స్వామి వారి హుండీల లెక్కింపును ప్రతి మూడు నెలలకోసారి పారదర్శకంగా భక్తులు, అధికారుల సమక్షంలోనే నిర్వహించి ఆదాయాన్ని బ్యాంకులో జమ చేస్తున్నారు.
శ్రీధర్ రావు పై ప్రజాభిమానం:
వెంకన్న ఆలయ అభివృద్ధికి చైర్మన్ గా శ్రీధర్ రావు చేస్తున్న సేవలు ఎన లేనివి. గత ప్రభుత్వంలో వరుసగా మూడు సార్లు, ప్రస్తుత ప్రభుత్వం లో నాలుగోసారి ట్రస్ట్ బోర్టు చైర్మన్ గా చేసిన పని తీరును స్వామి వారి భక్తులు మొచ్చుకుంటున్నారు. ఐదోసారి కూడా చైర్మన్‌గా ఆయనే ఉంటే దేవాలయం రెండో తిరుపతిగా విరాజిల్లుతుందని, భక్తులు
ఆయన ఎన్నికనే కోరుకుంటున్నారు.
రూ.5కోట్లతో మాస్టర్ ప్లాన్:
ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఎమ్మెల్యే నాయక త్వంలో ట్రస్ట్ బోర్టు చైర్మన్ శ్రీధర్ రావు వెంటపడి రూ.5కోట్ల మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనలు రూపొందించారు. ఇందులో ధర్మసత్రాలు, వసతి గదులు, వాష్ రూమ్స్, వాహనాల పార్కింగ్, తాగునీటి వసతి తదితర అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. కాగా చైర్మన్ పట్టుదలతో భక్తుల సౌకర్యార్థం జాతీయ రహదారి గోవర్ధన్ గిరి క్రాస్ నుంచి మీదికొండ వయా పల్లగుట్ట చిలుపూర్ దేవస్థా నం వరకు డబుల్ రోడ్డు 14.5 కిలో మీటర్ల రోడ్డును రూ.15కోట్లతో చేపట్టనున్నారు. అలాగే వెంకటేశ్వరపల్లి నుంచి దేవస్థానం వరకు సెంట్రల్ లైటింగ్, డబుల్ రోడ్డు ఏర్పాటు కానుం ది. ఈ రోడ్డు పూర్తయితే హన్మకొండ, జనగామ డిపోల నుంచి ఆలయా నికి బస్సు సర్వీసులను రెగ్యులర్ గా నడిపేందుకు ప్రణాళిక సిద్ధం చేశా రు. ఆలయ అభివృద్ధి కోసం శ్రీధర్ రావు నిరంతరం వెంటపడి కృషి చేయడం వల్ల ప్రతిపాదనలకు వేగంగా రూపొందించారు. భక్తుల సౌక ర్యాలను విస్తరించేలా త్వరలో అభివృద్ధి పనులు ప్రారంభం కానున్నా యి.
ఎమ్మెల్యే కడియం సహకారంతో వేగంగా ఆలయ అభివృద్ధి:
ట్రస్టు బోర్డు చైర్మన్ శ్రీధర్ రావు
ఆలయ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యంగా ఎమ్మెల్యే కడియం సహకారంతో రానున్న రోజుల్లో వేగంగా ఆలయ అభి వృద్ధి జరగబోతుంది. వారి సహకారం మరువలేనిది. మాస్టర్ ప్లాన్ అమలుకు రూ.5 కోట్ల నిధులు మంజూరు చేయించడంతో పాటు అన్యాక్రాంతమవుతున్న దాదాపు 14ఎకరాల ఆలయ భూములను గుర్తించి సర్వే చేపట్టి రక్షించడం గొప్ప విషయం. యాదగిరిగుట్ట దేవస్థా నం తరహాలో దేవస్థానం అభివృద్ధి కోసం భారీ నిధులు మంజూరు చేయించి ఆధ్యాత్మిక, టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేయాలి.

