ఆత్మిక అవగాహన కారణంగా కలిగేదే ఇతరుల పట్ల గౌరవము. ఆత్మిక అవగాహనతో నా చుట్టుప్రక్కల ఉన్నవారి సాధనను అర్థం చేసుకుని ఉన్నతికి తోడ్పడగలను. దీని కారణంగా నాతోటివారిలోని పొరపాట్లపై కాక సామర్థ్యాలపై, విశేషతలపై దృష్టి సారించడం వీలవుతుంది. నిజానికి, వారు పొరపాట్లు చెయ్యకుండా ఉండటానికి ఇది సహకరిస్తుంది. నాతోటి వారి పరివర్తనపై నాకు ఎంత నమ్మకం ఉంటుందో దాని ఆధారంగా నాలో ఎంత ఆత్మిక అవగాహన ఉంది అని నిర్థారించవచ్చు. ఈ విశ్వాసము, ప్రేమ కలిగి ఉండటమే నిజ మైన గౌరవము.
–బ్రహ్మాకుమారీస్.
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి