భగవంతుడిని క్షమాసాగరుడు అని అంటారు. అతని దయను అర్థం చేసుకున్నవారు జీవితంలో ఒక మంచి ఉత్తమ స్నేహితుడిని పొందాము అని భావిస్తారు. హృదయంలో శాంతి గూడు కట్టుకుంటుంది. భగవంతుడి దయను నీవు స్వీకరించినప్పుడు జీవితంపై నీకున్న దృక్పథం మారుతుంది. భగవంతుని కరుణా దృష్టి కారణంగా సంపూర్ణతను చేరుకోవడానికి నీకున్న సమర్థతను నీవు చూడగలవు. అప్పుడు నీపై నీవు దయా దృష్టి కలిగి ఉంటావు. స్వయంపై దయ అనగా సంపూర్ణత దిశగా సత్యంగా పాటుపడటము.
భగవంతుడి నుండి కావలసిన శక్తిని తీసుకున్నప్పుడు మనం ఎలా కావాలనుకుంటామో అలా కావచ్చు.
–బ్రహ్మాకుమారీస్.
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి