Bowrampet | నోట్లో బట్టలు కుక్కి.. కాళ్లు కట్టేసి..

Bowrampet | నోట్లో బట్టలు కుక్కి.. కాళ్లు కట్టేసి..

కన్న బిడ్డను కట్టెల పోయిలో వేసి కాల్చి చంపిన తల్లి

Bowrampet | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : రెండు నెలల కన్నబిడ్డ పాలిట ఓ తల్లి మరణశాసనం రాసింది. కనీ వినీ ఎరుగని ఈ దారుణ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ లోని బౌరంపేట్ లో చోటుచేసుకుంది.

రెండు నెలల బాలుడిని కన్న తల్లి అత్యంత దారుణంగా హత్య చేసింది. ఏడవకుండా కళ్లకు గంతలు కట్టి.. నోట్లో బట్టలు కుక్కి, కాళ్లు కట్టేసి మరి హత్య చేసింది. బాలుడిని కట్టెల పొయ్యిలో వేసి కాల్చి చంపింది. బౌరంపేట్ ప్రాంతంలో ఈ అమానుష ఘటన జరిగింది. స్థానికుల సమాచారంతో దుండిగల్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అదేపనిగా బాలుడు ఏడుస్తున్నాడన్న కోపంతో తల్లి ఈ పనిచేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Bowrampet |

Leave a Reply