AP | స‌భ‌లో మాట్లాడుతూ కుప్ప‌కూలిన బొత్స స‌త్య‌నారాయ‌ణ‌

చీపురుపల్లి : వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ నిరసన ర్యాలీలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో హుటాహుటిన ఆయనను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ రోజుతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తుండటంతో.. ఇచ్చిన హామీలను నెరవేర్చనందుకు.. వెన్నుపోటు రోజుగా పోలుస్తూ.. వైసీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తున్నారు. ఇందులో భాగంగా విజయనగరం జిల్లా చీపురుపల్లిలో వైసీసీ నేతలతో కలిసి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ నిరసన కార్యక్రమంలో పాల్గోన్నారు.

అయితే అధిక ఉష్ణోగ్రతలు ఉండటంతో అస్వస్థతకు గురైన ఎమ్మెల్సీ మాట్లాడుతుండగానే కుప్పకూలిపోయాడు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ప్రస్తుతం బొత్స సత్యనారాయణ ఆరోగ్యం ఎలా ఉందానే దానిపై ఎటువంటి సమాచారం అందుబాటులోకి రాలేదు. దీంతో పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు.

Leave a Reply