ఇద్దరికీ రెండు మద్యం షాపులు ఖరారు
సూర్యాపేట, ఆంధ్రప్రభ : సూర్యాపేట జిల్లా(Suryapet District)లో భార్యాభర్తలకు లక్కీ డ్రా పలకడంతో రెండు మద్యం దుకాణాలు ఏర్పాటుకు అనుమతి లభించింది. జిల్లాలో 93 దుకాణాలకు 2070 దరఖాస్తులు చేసుకోగా ఈ రోజు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్(Collector Tejas Nandalal Power) డ్రా పద్ధతిలో దుకాణాలను ఎంపిక చేశారు.
వీటిలో వేములపల్లి మండలం లక్ష్మీదేవి గూడెం గ్రామానికి చెందిన ఎలికట్టి భరత్ కు గెజిట్ నెంబర్ 21లో ఆయన భార్య శ్రావణికి గెజిట్ నెంబర్ 13 లో షాపులు దక్కించుకున్నారు. వందల టెండర్ల(Tenders)లో భార్యాభర్తలకు షాపులు దక్కడంతో పలువురు వారికి శుభాకాంక్షలు తెలిపారు.

