ఇద్దరు అక్కడికక్కడే మృతి..
జన్నారం, ఆంధ్రప్రభ : బొలోరో వాహనం మోటార్ సైకిల్‌ను ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు ఆదివాసీలు రోడ్డుపై పడి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన ఇది. సంఘటన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని మోర్రిగూడ గ్రామ(Morriguda village) సమీపాన ప్రధాన రహదారిపై ఈ రోజు మధ్యాహ్నం బోలోరో వాహనం మోటార్(motorcycle) సైకిల్ ను ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు ఆదివాసీలు అక్కడికక్కడే మృతి చెందారు. టీఎస్ 16యూఎ 6938 నెంబరు గల బొలోరో వాహనం,టీఎస్ 01ఈపీ 6302 నంబరు గల మోటార్ సైకిల్ ను ఢీ కొట్టింది. బొలోరో వాహనం పల్టీలు కొట్టి పక్కనే ఉన్న పంట పొలంలో పడింది.
ఈ ప్రమాదంలో మోటార్ సైకిల్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు రోడ్డుపై పడి అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల ముఖాలు నుజ్జునుజ్జయ్యాయి. మృతులు ఆదిలాబాద్ జిల్లా(Adilabad district)లోని ఉట్నూరు మండలంలోని ఘన్పూర్ కు చెందిన దొసండ్ల అంకన్న(55), నాగపూర్ కు చెందిన సీడం మోతిరాం (45)గా గుర్తించారు. బొలోరో వాహనం డ్రైవర్ షేక్ అల్మాస్(Sheikh Almas)కు ఎలాంటి దెబ్బలు తగలలేదు. సంఘటన స్థలాన్ని లక్షేట్టిపేట సీఐ రమణమూర్తి, జన్నారం ఎస్సై గొల్లపల్లి అనూష సందర్శించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం లక్షేటిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు.