Booking app | రైతులు సద్వినియోగం చేసుకోవాలి…

Booking app | రైతులు సద్వినియోగం చేసుకోవాలి…
Booking app | మునుగోడు, ఆంధ్రప్రభ : ఫార్మర్ రిజిస్ట్రీ, ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్(Booking app) ను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ నన్నూరి భూపతిరెడ్డి అన్నారు. ఈరోజు నల్లగొండ జిల్లా మునుగోడు మండల పరిధిలోని గూడపూర్ గ్రామంలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రైతులకు యూరియాలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం యాప్ ఏర్పాటు చేశారని ప్రతి ఒక్కరు ఇంటి వద్ద నుండి బుకింగ్ చేసుకుని ఎరువలను పొందాలని వివరించారు. ప్రయోగాత్మకంగా యాప్ లను ఏ విధంగా బుక్ చేసుకోవాలని రైతులకు వివరించారు. ఏఈఓ మాధగోని నరసింహ గౌడ్ మాట్లాడుతూ… ఫార్మర్ రిజిస్ట్రేషన్(registration) చేసుకోవడం వలన కేంద్ర ప్రభుత్వం అమలు చేసే అన్ని పథకాలకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనుసంధానం చేస్తున్నారు కాబట్టి ప్రతి రైతు ఫార్మా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్, కంభంపాటి నిర్మల నరసింహ, వార్డు మెంబర్లు మేడి పెద్దులు, జిట్టగోని నరసింహ, రాజు, వినయ్ కుమార్, దెందే మల్లేష్ ,దేశిడి నరసింహ, యాదయ్య,సత్తయ్య, లక్ష్మమ్మ,పార్వతమ్మ, రైతులు తదితరులు పాల్గొన్నారు.
