హైదరాబాద్, ఆంధ్రప్రభ : చిక్కడపల్లి త్యాగరాయ గాన సభ కళా(Singing Hall Art) దీక్షితులవారి హాలులో 5 సెప్టెంబర్ 2025, సాయంత్రం ఆరున్నర నుండి ఆచార్య శిప్రముని పీఠం, హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో శ్రీశివాంతక సంగ్రామం గ్రంధావిష్కరణ జరిగింది.
కళాజనార్ఠన మూర్తి గారు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ పుస్తకావిష్కరణ సభను ప్రారంభించారు. ముఖ్య అతిధిగా విచ్చేసిన త్రోవగుంట వేంకటసుబ్రహ్మణ్యం చేతుల మీదుగా పుస్తకావిష్కరణ జరిగింది.
సభాద్యక్షులు చారిత్రక నవలాచక్రవర్తి ఆచార్య ముదిగొండ శివప్రసాద్(Sivaprasad) ప్రసంగిస్తూ గురుపూర్ణిమ విశిష్టతను, సమాజానికి పౌరాణిక నాటక ఆవశ్యకతను వివరించారు. అక్కిరాజు సుందరరామకృష్ణ గ్రంధ పరిచయం చేస్తూ అద్భుతమైన ఈ నాటకం నేటి కళాకారులకు ఒక విలక్షణమైన(Distinctive) ప్రదర్శన చేయటానికి అనువుగా ఉందని అభిప్రాయపడ్డారు.
ఆ తర్వాత రచయిత కుమారుడు జన్నాభట్ల నరసింహ ప్రసాద్ వందన సమర్పణ గావించారు. సభ ప్రారంభానికి ముందు సంగీత(Music) గురు లక్ష్మీ కామేశ్వరి శిష్యులు చి.అనిర్విన, చి.జోషి, చి.గానవి లలిత గీతాలు, దేశభక్తి గీతాలు అద్భుతంగా ఆలపించి ప్రేక్షకులను ఎంతగానో రజింపచేశారు.