Bone cancer | ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు..

Bone cancer | ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు..

  • సహాయం చేయాలని వేడుకోలు…

Bone cancer | వేల్పూర్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం అమీనాపూర్ గ్రామానికి చెందిన ఈర‌వేణి భూపతి లత దంపతుల కూతురు బోన్ క్యాన్సర్(Bone cancer) తో బాధపడుతున్న ఈర‌వేణి మాధురి కుప్పకూలిపోవడంతో తల్లి లత హతశురాలైంది. హైదరాబాదులో బసవతారకం హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉంది.

సర్జరీ కోసం డబ్బులు కావాలని డాక్టర్ తెలపగా.. మా ఆర్దిక పరిస్థితి బాగాలేనందున పెద్ద మనసుతో ఆర్థిక సహాయం చేయండ‌ని కోరారు. అపన్నహస్తం కోసం తల్లి లత ఎదురుచూస్తున్న స‌మ‌యంలో అన్ని రకాల మెరుగైన వైద్య సేవ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని కుటుంబసభ్యులకు డాక్టర్లు తెలిపారు.

Bone cancer |

మాధురి బీదవారు కావడంతో రోజువారి కూలీ చేసుకొని బతుకుతున్న సమయంలో మాధురి బోన్ క్యాన్సర్ తో బాధపడుతున్న తల్లి లత దాతలు ఎవరైనా తోచినంత సహాయం అందించాలని కోరుకుంటున్నారు. ఎవరైనా సహాయం చేసే దాతలకు ఫోన్ పే 7842256352, ద్వారా అందించాలని తల్లి లత కోరుతున్నారు.

Leave a Reply