నిజామాబాద్ ప్రతినిధి, జులై 11 (ఆంధ్రప్రభ): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీ కగా సమాజంలో సౌ భాగ్యం, శాంతి, సమృ ద్ధిని కలగజేయాలనే భావనతో గ్రామదేవ తకు బోనాలు సమ ర్పించడం ఆనవాయి తీగా వస్తుందనీ అర్బ న్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్య నారాయణ (MLA Dhanpal Surya Narayana) అన్నారు. వినాయక్ నగర్ (Vinayak Nagar) లో లక్ష్మి సిల్క్స్ వారి ఆధ్వర్యంలో శుక్ర వారం నిర్వహించిన మహాలక్ష్మి అమ్మ వారి బోనాల పండుగ (Bonala festival) ఊరేగింపు కార్యక్రమా నికి ముఖ్యఅతిథిగా అర్బన్ శాసనసభ్యు లు ధన్ పాల్ సూర్య నారాయణ గుప్తా హాజ రయ్యారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర వ్యా ప్తంగా ఆషాడమాసంలో ప్రజలందరు భక్తి శ్రద్దలతో బోనం చేసి అమ్మవారిని కోలిస్తే స్వయంగా అమ్మవారే తమ ఇం టికి వస్తుందని భక్తు లందరు నమ్మకంగా భావిస్తారని అన్నారు. అమ్మ దయతో సకా లంలో వర్షాలు కురిసి రైతన్నలు అధిక పం టలు పండించాలని పిల్లజల్లా, గొడ్డు గోదా అన్నింటిని కాపా డాలని అమ్మవారిని పూజించడం జరు గుతుందన్నారు.
నగర ప్రజలందరు అష్టఐశ్వర్యాలతో, సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ అమ్మ వారి ఆశీర్వాదం ప్రజ లందరిపై ఉండాలని కోరుకున్నట్లు తెలియ జేసారు. ఊరేగింపులో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని, డప్పుల చప్పుళ్ళ పాటలతో, కోలాటాలతో ప్రదర్శ నలు ఇస్తూ సంబరా లను మరింత భక్తి మయంగా, శోభాయ మానంగా మార్చా రన్నారు.
తల్లి చల్లంగా దీవించమ్మ..
లక్ష్మి సిల్క్స్ షాపింగ్ మాల్ అధినేత శీతల్
సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలతో అందరూ సంపూర్ణ ఆయురారోగ్యాలతో చల్లంగా ఉండేలా దీవించు తల్లి అని లక్ష్మి సిల్క్స్ షాపింగ్ మాల్ అధినేత శీతల్ అమ్మవారిని వేడుకున్నారు.ఈ కార్యక్ర మంలో 22వ డివిజన్ కార్పొరేటర్ పంచారెడ్డి లావణ్య ,లింగం, లక్ష్మి సిల్క్స్ షాపింగ్ మాల్ అధినేత శీతల్ , బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు నాగోళ్ళ లక్ష్మినారా యణ,పార్షి రాజు, అల్లాడి రాజు, భోగ గంగాధర్, ఆనంద్, శివునూరి భాస్క ర్ ,సతీష్ పాల్గొన్నారు.