దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లో మరోసారి బాంబు బెదిరింపు (Bomb threat) లు హడలెత్తించాయి. ఈసారి ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) కే బాంబు ఉన్నట్లు ఈమెయిల్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
శుక్రవారం ఉదయం వచ్చిన మెయిల్‌లో, కోర్టు ప్రాంగణంలో మూడు బాంబులు (Three bombs) అమర్చామని, అవి మధ్యాహ్నం 2 గంటలలోపు పేలిపోతాయని పేర్కొంటూ, కోర్టును ఖాళీ చేయాలని హెచ్చరించారు. దీంతో వెంటనే బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లు హైకోర్టుకు చేరుకుని తనిఖీలు జరిపాయి.
ముందస్తు జాగ్రత్త చర్యగా న్యాయమూర్తులు (judges), న్యాయవాదులు, సిబ్బందిని కోర్టు భవనం నుంచి బయటకు పంపించారు. అయితే విస్తృతంగా చేసిన తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తాత్కాలికంగా కోర్టు కార్యకలాపాలు నిలిచిపోయాయి.

