Bomb Blast | చేతిలోనే పేలిన బాంబు.. ఒకరు మృతి

అమృత్‌సర్ : పంజాబ్‌ రాష్ట్రంలో షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. అమృత్‌సర్‌ బైపాస్‌లో బాంబ్‌ బ్లాస్ట్‌ జరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమృత్‌సర్‌ గ్రామీణ జిల్లాలోని కాంబో పోలీసు స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఓ వ్యక్తి బైపాస్‌లో బాంబు అమర్చేందుకు యత్నించాడు. అదే సమయంలో అతడి చేతిలోనే అది బ్లాస్ట్‌ అయ్యింది. ఈ ఘటనలో దుండగుడు తీవ్రగాయాలపాలయ్యాడు. పేలుడు శబ్దంతో అక్కడికి చేరుకున్న పోలీసులు గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సదరు వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply