Mantralayam | నదిలో గుర్తు తెలియని మహిళ మృతదేహం..

మంత్రాలయం, జులై 23(ఆంధ్రప్రభ) : మంత్రాలయం (Mantralayam) సమీపంలోని తుంగభద్ర నది (Tungabhadra River) లో బుధవారం గుర్తుతెలియని మహిళ మృతదేహం (woman dead body) లభ్యమైంది. ఎగువ ప్రాంతాల నుంచి నీటి ప్రవాహంలో కొట్టుకొచ్చినట్లు భావిస్తున్నారు. పోలీసులు (police) సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతురాలి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నాలు జరుపుతున్నట్లు హెడ్ కానిస్టేబుల్ లక్ష్మీనారాయణ తెలిపారు.

Leave a Reply