లారీలో మృతదేహం
తమిళ తంబిగా గుర్తింపు .. అతడు ఓనర్ కం డ్రైవర్
(అనంతపురం, ఆంధ్రప్రభ బ్యూరో) : అనంతపురం (Anantapur) రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలోని CRIT కళాశాల సమీపంలో పెట్రోల్ బంకు వద్ద ఆగి ఉన్న ఓ లారీలో మృతదేహం ఉన్నట్లు గుర్తించిన రూరల్ పోలీసులు నైట్ బీట్ పోలీసులు పెట్రోలింగ్ చేస్తూ ఆగి ఉన్న లారీని పరిశీలించగా అందులో మృత దేహం ఉన్నట్లు … అతను డ్రైవర్ కమ్ ఓనర్ అని, తమిళనాడు రాష్ట్రం శంకగిరి తాలూకాకు చెందిన వాడిగా గుర్తించారు. మృతుడి బంధువులతో రూరల్ పోలీసులు మాట్లాడారు.
అతనికి అనారోగ్య సమస్యలున్నాయని… మృతికి గుండెపోటు కారణమయ్యి ఉంటుందని ప్రాథమిక విచారణలో తెలుసుకున్న పోలీసులు (police) మృతదేహంపై ఎలాంటి గాయాలు ఏవీ లేకపోవడంతో మృతికి కారణాలు స్పష్టం కాలేదు. అయినప్పటికీ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని అనంతపురం రూరల్ సి.ఐ శేఖర్ వెల్లడించారు.