మల్దకల్, ఆంధ్రప్రభ : తాటికుంట రిజర్వాయర్ లో నిన్న గల్లంతైన దంపతులు మృతదేహాలు ఈ రోజు లభ్యమయ్యాయి. జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం తాటికుంట రిజర్వాయర్ లో నిన్న సాయంత్రం చేపల పట్టడానికి వెళ్లిన రాముడు(40), సంధ్య(36) అనే దంపతులు గల్లంతైన సంగతి తెల్సిందే. వారి ఆచూకీ కోసం బుధవారం నుంచి గాలిస్తున్నారు. గురువారం ఉదయం జలాశయంలో దంపతుల మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిరుపేద కుటుంబానికి చెందిన రాముడు జలాశయంలో చేపలవేట సాగించి కుటుంబాన్ని పోషించేవాడు.
గల్లంతైన దంపతుల మృతదేహాల లభ్యం

