Bodhan | పశువులతో నిరసన

Bodhan | పశువులతో నిరసన
Bodhan | బోధన్, ఆంధ్రప్రభ : ఇసుక రవాణాపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సాలురా మండలం తగ్గేల్లి గ్రామస్తులు ఇవాళ పశువులను నిలిపి నిరసన వ్యక్తం చేశారు. ఉదయం సమయంలో ఇళ్ల నుంచి పశువులను పొలాలకు తీసుకెళ్లాలంటే ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ సరిహద్దులోని మంజీరా నది నుంచి వందల సంఖ్యలో ట్రాక్టర్లు ఇసుక నింపుకొని వెళుతున్నాయి. రహదారి ఇరుకుగా ఉండడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారుతుంది. ప్రజల ఇబ్బందులను రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంతో గ్రామస్తులు పశువులను నిలిపి ఇసుక రవాణాలను అడ్డుకున్నారు.
