బోడె రామచంద్ర యాదవ్ ఆమరణ నిరాహార ధీక్ష ప్రారంభం

బోడె రామచంద్ర యాదవ్ ఆమరణ నిరాహార ధీక్ష ప్రారంభం

బీసీల అభ్యున్నతికి ధర్మ దీక్ష..
మండల్ వారసుల మద్దతు..
ఐదు డిమాండ్లపై పోరాటం


ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : బీసీ సామాజిక వ‌ర్గాల అభ్యున్న‌తే ల‌క్ష్యంగా భారత చైతన్య యువజన (బీసీవై) పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ ఆమరణ నిరాహార ధీక్ష ప్రారంభమైంది. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయ ఆవరణలో మొదలైన ధ‌ర్మ దీక్ష‌కు పలు బీసీ సంఘాల నాయకులు హాజరయ్యారు. గ‌తంలో నిర్వ‌హించిన‌ “బీసీ సింహగర్జన” సభలో ఐదు కీలక డిమాండ్లను ఆయ‌న ప్ర‌స్తావించారు. అయితే.. వాటిపై ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి స్పంద‌న రాకపోవడంతో ఈ ధీక్షకు సిద్దమైనట్లు రామచంద్ర యాదవ్ ప్రకటించారు.

అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం, ఓబీసీ రిజర్వేషన్ల కోసం పాటుపడిన బీపీ మండల్ మనుముడు డా.సూరజ్ మండల్ ఈ కార్యక్రమానికి హాజరై రామచంద్ర యాదవ్ చేస్తున్న ధీక్షకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా సూరజ్ మండల్, జ్యోతిబా పూలే మనుమరాలు డా.ఎస్.పూలే మాట్లాడుతూ… బీసీ వర్గాల అభ్యున్నతి కోసం రామచంద్ర యాదవ్ చేస్తున్న పోరాటం అభినందనీయమని, అన్ని వేళలా సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని వ్యాఖ్యానించారు. బీసీలందరి మద్దతుతోనే రాజ్యాధికారం సిద్ధిస్తుందని, అప్పుడే సమన్యాయం జరుగుతుందని వ్యాఖ్యానించారు.

Leave a Reply