Boath – బీజేపీ, కాంగ్రెస్ లకు బిగ్ షాక్

నేరడీగొండ ( ఆంధ్రప్రభ) బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ ఆధ్వర్యంలో బిజెపి మండల అధ్యక్షుడు సాబ్లే సంతోష్ బిజెపి కాంగ్రెస్ కార్యకర్తలు భారీ ఎత్తున బీఆర్ఎస్ లో చేరారు.గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఎమ్మెల్యే అనిల్ యాదవ్ఆహ్వానించారు.

నెరడిగొండ మండల బిజెపి అధ్యక్షుడు సాబ్లే సంతోష్ మరియు కాంగ్రెస్ నాయకులు ఆయన అనుచరులు దాదాపు 100 మంది ఈరోజు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ గారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాధవ్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సాబ్లే సంతోష్ మాట్లాడుతూ కార్యకర్తలకు గుర్తించడంలో బిజెపి పార్టీ విఫలమైందని నమ్ముకున్న కార్యకర్తలకు తగిన గౌరవం కల్పించట్లేదని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై ప్రజలు తిరగపడుతున్నారని ఇక తెలంగాణ రాష్ట్రాన్ని మంచి చేయాలనే ఉద్యేశం ఉన్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని అన్నారు.

నియోజకవర్గానికి ఎమ్మెల్యే ప్రమేయంతోనే నిధులు వస్తాయని బోథ్ నియోజకవర్గానికి వందల కోట్లతో అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే అనిల్ జాధవ్ విజన్ , క్రేజ్ చూసి బీఆర్ఎస్ పార్టీలో చేరానని అన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాధవ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను గుర్తిస్తుందని అందరికీ తగిన స్థానం అందిస్తుందని అన్నారు.

పార్టీలో చేరిన వారిలో సాబ్లే సంతోష్ సింగ్, బాక్రే లక్ష్మణ్, రబడే జగదీష్, ఉడుగుల అభిలాష్, బోగి రాజేందర్, మెస్రం గంగా ప్రసాద్, బొంతుకుల శ్రీను, సిరా నగేష్, బాక్రే సురేష్, బాక్రే కృష్ణ, బోదాసు శంకర్, తగరే సుందర్ సింగ్, బాక్రే ప్రేమ్, చిలకాడి పురుషోత్తం, సాబ్లే గణేష్, కటక్ వాల్ ఉత్తమ్, మహాదు, ఆత్రం శంకర్, ధనరాజ్, కృష్ణ, సంతోష్, రోహిదాస్ ఉన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ గారు మరియు మండల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *