Blocked | చైనా ప్ర‌భుత్వ‌ మీడియాకు భార‌త్ ఝ‌ల‌క్ – గ్లోబ‌ల్ టైమ్స్, షిన్షువాపై నిషేధం

అస‌త్య క‌థానాలు ప్ర‌చురిస్తుందంటూ ధ్వ‌జం
ఆ దేశ అధికార ప్ర‌చుర‌ణ సంస్థ గ్లోబ‌ల్ టైమ్స్ ఎక్స్ ఖాతా బ్లాక్
అలాగే చైనాలో ప్ర‌ముఖ దిన ప‌త్రిక షిన్షువాపై నిషేధం
ట‌ర్కీ టిఆర్ టి వ‌ర‌ల్డ్ న్యూస్ సైతం బ్లాక్

న్యూ ఢిల్లీ – చైనా ప్రభుత్వ ఆధ్వర్యంలోని మీడియా సంస్థ గ్లోబల్‌ టైమ్స్‌కు చెందిన ఎక్స్‌ ఖాతాను భారత్‌ నిలిపివేసింది. ఆపరేషన్ సిందూర్ గురించి అసత్య సమాచారాన్ని ప్రచురిస్తుందని పేర్కొంటూ దానిని బ్లాక్ చేసింది. ఆ ఖాతాను ఓపెన్ చేయగానే అకౌంట్ విత్‌హెల్డ్‌ అని కనిపిస్తోంది. అలాగే మరో చైనా మీడియా సంస్థ షిన్హుహా సామాజిక మాధ్యమ ఖాతాను కూడా నిలిపివేసింది. అంతేగాకుండా తుర్కియేకు చెందిన టీఆర్‌టీ వరల్డ్ ను ఎక్స్ అకౌంట్‌పై కూడా వేటు వేసింది. పహల్గాం ఉగ్రదాడికి ఆపరేషన్‌ సిందూర్‌తో భారత్‌ బలగాలు బదులు ఇచ్చాయి. పాక్‌లోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే

ఇది ఇలా ఉంటే మన మిలిటరీ ఆపరేషన్‌పై గ్లోబల్ టైమ్స్ కవరేజ్‌ను ఉద్దేశించి చైనాలోని భారత దౌత్య కార్యాలయం ఇప్పటికే స్పందించింది. ఇక‌పై భార‌త్ అధికారులు దృవీక‌రించిన వార్త‌లను మాత్ర‌మే పోస్ట్ చేయాల‌ని ఆ ప‌త్రిక ఎడిట‌ర్ ను కోరింది.
సమాచారాన్ని ప్రచురించే ముందు వాస్తవాలను ధ్రువీకరించుకోవాలని ఆ గ్లోబ‌ల‌ర్ టైమ్ కు సూచించింది.

Leave a Reply