హైదరాబాద్, ఆంధ్రప్రభ : కాళేశ్వరం ప్రాజెక్టుపై బీజేపీ వైఖరే నిజమని మరోసారి రుజువైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. కాళేశ్వరం అవినీతికి బీఆర్ఎస్ (BRS) బాధ్యత వహించాల్సిందేనని డిమాండ్ చేశారు. దీనిపై మొదటి నుంచి సీబీఐ (CBI) విచారణ కోరుతున్నామన్నారు.
కాంగ్రెస్ మాత్రం బీఆర్‌ఎస్‌ని కాపాడుతూ చర్యలు ఆలస్యం చేసిందన్నారు. ఈ రోజు నిజానికి తలవంచి సీబీఐకి అప్పగించేందుకు అంగీకరించారన్నారు. వెంటనే సీబీఐకి లేఖ పంపాలని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ (phone tapping) వ్యవహారం డైలీ సీరియల్(daily serial)గా కొనసాగుతోందని బండి సంజయ్ అన్నారు.