అభివృద్ధిని అడ్డుకోవడమే కాంగ్రెస్ లక్ష్యమా..?

అభివృద్ధిని అడ్డుకోవడమే కాంగ్రెస్ లక్ష్యమా..?

  • బీజేపీ పరకాల పట్టణ అధ్యక్షుడు గాజుల నిరంజన్

వరకాల, ఆంధ్రప్రభ : దేశ అభివృద్ధి కార్యక్రమాలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు అడ్డంకులు సృష్టిస్తోందని బిజెపి పరకాల పట్టణ అధ్యక్షుడు గాజుల నిరంజన్ ఆరోపించారు. ఢిల్లీలో జరుగుతున్న ఇండియా–ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ప్రదర్శించిన వైఖరిని ఆయన ఖండించారు. అభివృద్ధిని అడ్డుకోవడమే కాంగ్రెస్ పార్టీ మనస్తత్వమని, అంతర్జాతీయ వేదికల్లో దేశ ప్రతిభను ప్రతిబింబించాల్సిన సమయంలో ఇలాంటి చర్యలు దేశ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నాయని విమర్శించారు. గ్లోబల్ సమ్మిట్‌లు జాతీయ ఏక్యతకు వేదికలుగా నిలవాల్సి ఉండగా, కాంగ్రెస్ కార్యకర్తల ప్రవర్తన ఆ లక్ష్యానికి విరుద్ధమని అన్నారు. దేశ ప్రయోజనాలను ముందుంచుకుని అన్ని రాజకీయ పార్టీలు సమన్వయంతో పనిచేయాలని, అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని గాజుల నిరంజన్ పిలుపునిచ్చారు.

Leave a Reply