4వ వార్డులో బీజేపీ అభ్యర్థి తేరాల మంజుల ప్రచారం

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ కేంద్రంలోని 4 వ వార్డ్ లో బిజెపి అభ్యర్థి తేరాల మంజుల శనివారం ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను కలుసుకొని తనను ఆశీర్వదించి గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. తాను గెలిస్తే చేపట్టబోయే కార్యక్రమాలను గురించి ఓటర్లకు మంజుల వివరించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు చిరిగే శ్రీనివాస్, తేరాల రాజేశ్వర్, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
