bjp l ఆదరించి గెలిపించండి అభివృద్ధి చేస్తా..

bjp l ఆదరించి గెలిపించండి అభివృద్ధి చేస్తా..

1వ వార్డు బిజెపి అభ్యర్థిగా రాజశేఖర్ రెడ్డి

bjp l మక్తల్ , ఆంధ్రప్రభ; మక్తల్ మున్సిపల్ ఎన్నికల్లో 1వ వార్డు నుండి పోటీ చేస్తున్న తనను ఆదరించి గెలిపించండి అభివృద్ధి చేస్తానని బిజెపి అభ్యర్థి బి. రాజశేఖర్ రెడ్డి అన్నారు .ఎన్నికల ప్రచారం చివరి రోజు సందర్భంగా ఆయన వార్డు ప్రజలకు లేఖ విడుదల చేశారు . మక్తల్ అభివృద్ధి బిజెపితోనే సాధ్యం అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులతో మున్సిపాలిటీ అభివృద్ధి చెందుతున్న అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలను నిర్లక్ష్యం చేస్తుందని ధ్వజమెత్తారు. రెండేళ్లలో మున్సిపాలిటీలో చేపట్టిన అభివృద్ధి శూన్యమని అన్నారు .కేంద్ర ప్రభుత్వం ఎంపీ డీకే అరుణ సహకారంతో మున్సిపాలిటీకి పెద్ద ఎత్తున తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఒకటో వార్డు పరిధిలో నెలకొన్న సమస్యల పట్ల స్థానికుడిగా తనకు పూర్తి అవగాహన ఉందని సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తానని అన్నారు .వార్డు పరిధిలోని అన్ని ప్రాంతాల్లో సిసి రోడ్లు మురుగు కాలువల నిర్మాణం చేపడతామన్నారు. అదేవిధంగా తాగునీటి సమస్య ,విద్యుత్ సమస్య వంటి పలు సమస్యలను తీర్చుతామని హామీ ఇచ్చారు.

Leave a Reply