ఢిల్లీలో కాదు గల్లీలో కమలాన్ని గెలిపించాలి..

ఢిల్లీలో కాదు గల్లీలో కమలాన్ని గెలిపించాలి..
కల్లబొల్లి మాయమాటలకు మోసపోవద్దు..
బిజెపితోనే అభివృద్ధి సాధ్యం..
ఎంపీ ధర్మపురి అరవింద్
నిజామాబాద్, ఆంధ్రప్రభ : ఢిల్లీలో కాదు గల్లీలో కమలం పార్టీని భారీ మెజా రిటీతో గెలిపించాలని ఎంపీ ధర్మపురి అరవింద్ కోరారు. కల్లబొల్లి మాయ మాటలను నమ్మి మో సపోవద్దని ఎంపీ తెలిపా రు సోమవారం నిజా మాబాద్ నగరంలో బిజెపి జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి ఆధ్వర్యంలో ఒకటో డివిజన్ బిజెపి అభ్యర్థి గంగాధర కు మద్దతుగా నిర్వహించిన కార్యక్ర మంలో ఎంపీ ధర్మపురి అరవింద్ పాల్గొని మాట్లాడారు. ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి ఇలా ఎన్నిసార్లు మీరు మోసపోతారు.. అమలు కానీ సాధ్యం కానీ హామీ లను నమ్మి గతంలో కారు, ఇప్పుడు కాంగ్రెస్ ను నమ్మి మోసపోతారని ప్రజ లని ఎంపీ ప్రశ్నించారు. వా ళ్లు ఇచ్చే హామీలు పూర్తి స్థాయిలో అమలు అవు తాయని ఒక్కసారి అన్న ఆలోచించారా అని ఎంపీ తెలిపారు.
ప్రజలారా మీరు వేసే ఓటు ఒక వ్యక్తికి కాదు ఒక వ్యవస్థకు… అవినీ తిరైత భారత దేశంగా తీర్చిదిద్దడమే భారతీయ జనతా పార్టీ లక్ష్యమని కోరారు. డోర్ డివిజన్ అభ్యర్థి కురువగంగాధర్ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కా రానికి పోరాడు తాడని తప్పకుండా భారీ మెజా ర్టీతో బిజెపిని గెలిపిం చాలని ప్రజలను అభ్యర్థిం చారు. ఈ సందర్భంగా ఒకటో డివిజన్ అభ్యర్థి కురవ గంగాధర్ మా ట్లాడుతూ డివిజన్ ని ఉత్తమ డివిజన్ గా తీర్చి దిద్దరమే నా లక్ష్యమని అన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుంటానని ఒక్కసారి అవకాశమిచ్చి ఆశీర్వదించండి అని ఒకటో డివిజన్ ప్రజలని కోరారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
