ప్రచారంలో దూసుకుపోతున్న బిజెపి అభ్యర్థి భాగ్యలక్ష్మి…

ప్రచారంలో దూసుకుపోతున్న బిజెపి అభ్యర్థి భాగ్యలక్ష్మి…

పాల్వంచ 8 ఫిబ్రవరి (ఆంధ్రప్రభ): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ మండలం నాలుగో డివిజన్ బిజెపి అభ్యర్థి చెరుకు భాగ్యలక్ష్మి ప్రచారంలో దూసుకుపోతుంది. భారతీయ జనతా పార్టీ అభివృద్ధి విషయంలో వెనకడుగు వేయదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారధ్యంలో భారతదేశం ప్రపంచ దేశాల్లో పోటీ పడుతుందన్నారు. నాలుగో డివిజన్ అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరూ బిజెపి అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలన్నారు. బిజెపికి ఓటు వేసి గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని మాట ఇస్తే తప్పకుండా అమలు చేసి తిరుతామని, డివిజన్లో అనేక సమస్యలు కొట్టుమిట్టాడుతున్నాయని ప్రతి సమస్య తనకు తెలుసని అన్నిటిని గెలిచిన వెంటనే పరిష్కారం చూపుతానని అన్నారు. డివిజన్లోని పలు ప్రాంతాల్లో కాలినడక ద్వారా ఇంటింటికి తిరిగి అనేక సమస్యలను గుర్తించడం జరిగిందని తప్పకుండా పరిష్కారం జరుగుతుందని కమలం పువ్వు పై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఆమె వెనక భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.

Leave a Reply