పారిశుద్ధ్య కార్మికుల మధ్య జన్మదిన వేడుకలు..

కరీమాబాద్, ఆంధ్రప్రభ : గ్రేటర్ వరంగల్‌లో పారిశుద్ధ్య కార్మికుల మధ్య తన జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని 40వ డివిజన్ కార్పొరేటర్ మరుపల్ల రవి తెలిపారు.
శనివారం డివిజన్ పరిధిలోని ఎస్‌కే గౌడ్ కళాభవన్ వార్డు కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులు ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి కార్మికులతో కలిసి వేడుకలను జరుపుకున్నారు.
ఈ సందర్భంగా మరుపల్ల రవి మాట్లాడుతూ, తమ ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా విధులను నిర్వర్తిస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సేవలు అమూల్యమని కొనియాడారు. వారి మధ్య జన్మదినాన్ని జరుపుకోవడం ప్రత్యేక అనుభూతి కలిగించిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో జవాన్లు కృష్ణ, ఆదాం, రమేష్ తదితరులతో పాటు పారిశుద్ధ్య కార్మికులు పాల్గొని కార్పొరేటర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
