వాళ్ళు తప్పకుండా థంబ్ వేయాల్సిందే..

తెలంగాణ ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) టికెట్ తనిఖీ సిబ్బంది (TTE) కోసం బయోమెట్రిక్ హాజరు విధానాన్ని రైల్వే శాఖ ప్రవేశపెట్టింది. దీనివల్ల ఉద్యోగుల పనితీరు, హాజరు మరింత పారదర్శకంగా ఉంటుంది.

ప్రారంభంలో ఈ విధానాన్ని సికింద్రాబాద్, కాచిగూడ, విజయవాడ, గుంతకల్, గుంటూరు, నాందేడ్లలోని టికెట్ తనిఖీ సిబ్బంది లాబీల్లో ప్రారంభించారు. త్వరలో జోన్ వ్యాప్తంగా ఉన్న 73 లాబీలకు దీన్ని విస్తరించనున్నారు.

ఈ కొత్త విధానం ప్రకారం.. టికెట్ తనిఖీ సిబ్బంది లాబీ అప్లికేషన్లో ఫింగర్ ప్రింట్ పరికరాన్ని ఉపయోగించి తమ హాజరును నమోదు చేయాలి. ఈ పరికరం నేరుగా సీ-డ్యాక్ పోర్టల్తో అనుసంధానమై ఉంటుంది. దీనివల్ల సిబ్బంది రైలు ప్రయాణం మొదలుపెట్టే స్టేషన్‌లో, అలాగే గమ్యస్థానం చేరుకున్నప్పుడు కూడా వారి హాజరు నిర్ధారణ అవుతుంది. వారి లాగిన్, లాగౌట్ సమయాలు కూడా వాస్తవ సమయం ప్రకారం రికార్డ్ అవుతాయని రైల్వే శాఖ తెలిపింది.

ఈ డిజిటల్ టెక్నాలజీ అమలుపై దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ సంతృప్తి వ్యక్తం చేశారు. డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో ఎస్‌సీఆర్ ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply