తల్లాడ, ఫిబ్రవరి 12 (ఆంధ్రప్రభ) : ఖమ్మం జిల్లా మండల కేంద్రమైన తల్లాడలోని కొత్తగూడెం రోడ్ లో గల బయోమాస్ ప్లాంట్ ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం ప్రారంభించి, పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో బయోమాస్ ప్లాంట్ రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని, రైతులు ఆదరించి సహకరించి మేలు పొందాలని ఆయన అన్నారు.
బయోమాస్ ప్లాంట్ వలన రైతులు పంటలు దిగుబడి అయిన తర్వాత పత్తి కట్టే, మిరప కట్టే, మొక్కజొన్న చెత్తను రైతులు కాలబెట్టకుండా బయోప్లాంట్ ద్వారా కాలుష్య నివారణ చేసేందుకు ఈ ప్లాంట్ ఎంత ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గుడివాడ శాసనసభ్యులు వెనిగండ్ల రాము, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మట్టా దయానంద్ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.