Bikkanoor | క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట..

Bikkanoor | క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట..

Bikkanoor | బిక్కనూర్, ఆంధ్రప్రభ : గ్రామీణ ప్రాంత క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మండలంలోని అయ్యవారిపల్లి గ్రామ సర్పంచ్ జాల సత్యం చెప్పారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని గ్రామంలో గ్రామ సచివాలయం ఆధ్వర్యంలో మహిళలు, యువకులకు కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆనందోత్సవాల మధ్య కబడ్డీ పోటీలలో పాల్గొన్నారు. గెలుపొందిన విజేతలకు నగదు తో పాటు బహుమతులను ఆయన చేతుల మీదుగా అందజేశారు. అనంతరం సర్పంచి సత్యం మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారులు తమ నైపుణ్యతను బయటకు తీసుకురావాలని చెప్పారు.

Bikkanoor

గెలుపు ఓటములను సమానంగా తీసుకుని ఓటమి చెందిన వారు రేపటి గెలుపు కోసం కృషి చేయాలని తెలిపారు. ఓటమి చెందిన వారు నిరుత్సవపడకుండా ముందుకు పోవాలని ఆయన సూచించారు. ప్రతి సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని గ్రామంలో క్రీడా పోటీలను నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. గ్రామంలో ఉన్న యువకులు క్రీడలతో పాటు చదువులో ముందుకు పోవాలని చెప్పారు. చెడు అలవాట్లకు ప్రతి ఒకరు దూరంగా ఉండాలని కోరారు. గ్రామాన్ని అన్ని రంగాలలో కలిసికట్టుగా అభివృద్ధి చేసుకోవాలని తెలిపారు.

Leave a Reply