Bikkanoor | గ్రామీణ క్రీడలకు ప్రభుత్వం పెద్దపీట….

Bikkanoor | గ్రామీణ క్రీడలకు ప్రభుత్వం పెద్దపీట….
రాష్ట్ర పీసీసీ ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి…
Bikkanoor | బిక్కనూర్ , ఆంధ్రప్రభ : గ్రామీణ క్రీడల కారుల అభివృద్ధి కోసం ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర పీసీసీ ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు .ఇటీవల కామారెడ్డి జిల్లా కేంద్రంలో నియోజకవర్గం క్రీడల్లో కబడ్డీ పోటీలలో పాల్గొన్న మండల కేంద్రానికి చెందిన బండి శ్రీనిధి జిల్లాస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారు .ఈ సందర్భంగా ఆమెను మండల కేంద్రంలో అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారుల నైపుణ్యతను బయటకు తీసేందుకు ప్రభుత్వం సీఎం క్రీడలను నిర్వహిస్తుందని గుర్తు చేశారు. ఇట్టి పోటీల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఎంతోమంది క్రీడాకారులు తమ నైపుణ్యతను బయటకు తీసుకు వచ్చారని గుర్తు చేశారు. గ్రామస్థాయి నుండి రాష్ట్రస్థాయి వరకు సీఎం కప్ క్రీడా పోటీలను నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. చదువుతోపాటు క్రీడలలో రాణించాలని ఆయన సూచించారు. ప్రతి ప్రభుత్వ పాఠశాల తో పాటు జూనియర్ కళాశాలలో వ్యాయామ ఉపాధ్యాయులను ప్రభుత్వం నియమించిందని గుర్తు చేశారు. క్రీడాకారులు ఆయా రంగాలలో ముందుకు పోవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆయన సూచించారు. క్రీడాకారులు తమ ప్రతిభను మరింత ముందుకు తీసుకెళ్లాలని చెప్పారు. పేద క్రీడాకారులకు తాను ఎల్లవేళలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దయాకర్ రెడ్డి పలువురు క్రీడాకారులు ఉన్నారు.
