Bikkanoor | ఏలుకో.. ఎల్లమ్మ తల్లీ

Bikkanoor | ఏలుకో.. ఎల్లమ్మ తల్లీ
- రేపటి నుంచి రేణుకా ఎల్లమ్మ ఉత్సవాలు
Bikkanoor | బిక్కనూర్, ఆంధ్రప్రభ : బిక్కనూరు మండల కేంద్రంలో రేపటి (శనివారం) నుండి ఐదు రోజుల పాటు రేణుక ఎల్లమ్మ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు పట్టణ గౌడ సంఘం ప్రతినిధులు తెలిపారు. 50వ వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరణ చేశారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు అన్ని వసతులు కల్పించారు. మొదటి రోజు అమ్మవారికి అభిషేకాలు, అర్చనలు నిర్వహిస్తారు. ఆలయ ప్రాంగణంలో వచ్చే నెల 2న అమ్మవారి కల్యాణం జరిపించనున్నారు. కల్యాణం అనంతరం అమ్మవారికి బోనాలను సమర్పిస్తారు.

