బీహారీ అరెస్ట్

సహచరుడిపై కత్తితో దాడి
(గుడివాడ – ఆంధ్రప్రభ)
గుడివాడ రూరల్ మండలం వలివర్తిపాడు పంచాయతీ పరిధిలో గణేష్ గ్రాండ్ అపార్ట్మెంట్ సమీపంలో బీహార్ రాష్ట్రానికి చెందిన చందన్ కుమార్ (19) వ్యక్తి ని వెంటాడి పట్టుకున్నారు. విచారణలో అతడు హిందీలో మాట్లాడుతుండటంతో హిందీ తెలిసిన కానిస్టేబుల్ సహాయంతో విచారించగా, అతని వాంగ్మూలంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
నిందితుడు తెలిపిన వివరాల ప్రకారం, తాను గడచిన రెండు సంవత్సరాలుగా విజయవాడ జక్కంపూడిలో డైరీ ఫారంలో పనిచేస్తున్నాడని, తనతో పాటు బీహార్‌కు చెందిన అన్షు కుమార్ కూడా గుడివాడలో డైరీ ఫారంలో పనిచేస్తున్నాడని తెలిపాడు. నవంబర్ 5వ తేదీన గుడివాడకు వచ్చిన వారి ఇద్దరి మధ్య డబ్బుల విషయంలో వివాదం ఏర్పడి గొడవ జరిగి, ఆ సమయంలో కోపంతో అన్షు కుమార్‌పై కత్తితో దాడి చేశాడు.
దాడి అనంతరం రక్తపు మరకలతో ఉన్న కత్తిని, దుస్తులను, మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొబైల్లో అన్షు కుమార్ గాయాలతో ఉన్న వీడియోలు మరియు ఫోటోలు ఉన్నవి పోలీసులు ముద్దాయిని అరెస్టు చేసి కోర్టు ముందు హాజరపరిచినారు.
