Bihar | బిజెపి నేత‌, ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త గోపాల్ దారుణ హ‌త్య

పాట్నా – బీహార్ అసెంబ్లీ (Bihar Assembly ) ఎన్నికలకు (elections ) ముందు పాట్నాలోని (Patna ) వ్యాపారవేత్త, బీజేపీ నేత గోపాల్ ఖేమ్కాను (gopal khemka ) ఇంటి ముందే దుండగులు కాల్చి (gun fire ) చంపారు. హత్య రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. గాంధీ మైదాన్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని ‘పనాచే’ హోటల్ సమీపంలో శుక్రవారం రాత్రి ఖేమ్కా హత్యకు గురయ్యారు. హోటల్ పక్కనే ఉన్న ట్విన్ టవర్ సొసైటీలో (twin tower society ) నివాసం ఉంటున్నారు. ఇంట్లోకి వెళ్తుండగా అగంతకులు హఠత్తుగా ప్రవేశించి తుపాకీతో కాల్పులు జరిపారు. అక్కడికక్కడే ఖేమ్కా ప్రాణాలు వదిలారు.

ఇక సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని హత్యాస్థలిని పరిశీలించారు. ఒక బుల్లెట్, షేల్ కేసింగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. గ‌త‌ రాత్రి 11 గంటల ప్రాంతంలో వ్యాపారవేత్త గోపాల్ ఖేమ్కాను కాల్చి చంపినట్లు గాంధీ మైదాన్ సౌత్ ప్రాంతం నుంచి తమకు సమాచారం అందిందని సిటీ ఎస్పీ దీక్ష తెలిపారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఆసుపత్రి మరియు నేరస్థలానికి చేరుకున్నట్లు వెల్లడించారు. నేరస్థలాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

ఖేమ్కా వృత్తిరీత్యా వ్యాపారవేత్త. ఆయన కుమారుడు గుంజన్ ఖేమ్కా మూడేళ్ల క్రితం హత్యకు గురయ్యాడు. మూడేళ్ల తర్వాత తండ్రి కూడా హత్యకు గురి కావడం దిగ్భ్రాంతికరం. ఇక సంఘటనాస్థలిని పూర్ణియ నుంచి స్వతంత్ర ఎంపీగా గెలిచిన పప్పు యాదవ్ పరిశీలించారు. అనంతరం ఎక్స్‌‌లో నితీష్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని విమర్శించారు. ‘‘బీహార్‌లో ఎవరూ సురక్షితంగా లేరు. బీహార్ నేరస్థులకు స్వర్గధామంగా మారింది! నితీష్ జీ, దయచేసి బీహార్‌ను విడిచిపెట్టండి.’’ అని ఆయన అన్నారు. ఖేమ్కా కుమారుడు హత్యకు గురైనప్పుడే ప్రభుత్వం.. నిందితులపై కఠిన చర్యలు తీసుకుని ఉండుంటే గోపాల్ ఖేమ్కా ఈరోజు హత్యకు గురయ్యేవాడు కాదని పప్పు యాదవ్ అన్నారు.

Leave a Reply