తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 తాజా ప్రోమో ప్రేక్షకుల్లో హైప్ క్రియేట్ చేస్తోంది. వెన్నెల కిషోర్ – నాగార్జున ఫన్ డైలాగ్‌లతో ప్రారంభమైన ఈ ప్రోమో, చివరికి పూర్తిగా ఉత్కంఠ రేపేలా మలిచారు. నాగార్జున “ఈసారి డబుల్ హౌస్.. డబుల్ డోస్” అంటూ మొదటి ట్విస్ట్ ఇచ్చారు. ఆ వెంటనే, “బిగ్ బాస్ నే మార్చేశా” అంటూ మరింత సస్పెన్స్ క్రియేట్ చేశారు.

ప్రోమో క్లైమాక్స్‌లో “ఇది చదరంగం కాదు.. రణరంగమే!” అనే డైలాగ్‌తో షో థ్రిల్ పీక్స్‌కి చేరింది. ఈసారి ఫార్మాట్ గత సీజన్లకు భిన్నంగా, కొత్తగా ఉండబోతోందని స్పష్టమవుతోంది. ఇండస్ట్రీ టాక్ ప్రకారం, సెలెబ్రెటీలు వర్సెస్ కామన్ పీపుల్ కాన్సెప్ట్‌తో సీజన్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అందుకే ఈసారి బిగ్ బాస్ హౌస్‌లో ఎంటర్టైన్‌మెంట్, కాన్ఫ్లిక్ట్స్, ట్విస్టులు అన్నీ డబుల్‌గా ఉండబోతున్నాయి.

Leave a Reply