మహిళా సాదికారతే మా ప్రజా ప్రభుత్వ లక్ష్యం

మహిళా సాదికారతే మా ప్రజా ప్రభుత్వ లక్ష్యం
ఊర్కొండ, ఆంధ్రప్రభ : మహిళా సాధికారతే లక్ష్యంగా మా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని నర్సంపల్లి సర్పంచ్ శైలజ శ్రీశైలం అన్నారు. శుక్రవారం మహిళా సంఘం భవన నిర్మాణానికి సర్పంచ్ శైలజశ్రీశైలం ఆధ్వర్యంలో భూమి పూజ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సహకారoతో గ్రామంలో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని, భవనం మహిళ అభివృద్ధికి తోడ్పడుతుందని ఆమె పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి ,వార్డు సభ్యులు చెదురుపల్లి విజయ్ కుమార్ .అంజయ్య ,స్వరూప, బాలస్వామి ,లక్ష్మి, రేవతి, ఏఈ మహేందర్ ,పంచాయతీ కార్యదర్శి నస్రీన్, గ్రామ మహిళా సంఘాల అధ్యక్షురాలు సీతమ్మ ,బుక్ కీపర్ పరమేశ్వరి, ఫీల్డ్ అసిస్టెంట్ కలమ్మ ,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వీరెడ్డి వెంకటరెడ్డి ,కాశయ్య జైపాల్ రెడ్డి యాదయ్య గ్రామ ప్రజలు గ్రామ మహిళలు మహిళా సంఘాలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
