ఆంజనేయస్వామి ఆలయ పునర్ నిర్మాణానికి భూమి పూజ

ఆంజనేయస్వామి ఆలయ పునర్ నిర్మాణానికి భూమి పూజ

జఫర్ గడ్, ఆంధ్రప్రభ : జనగామ జిల్లా జఫర్ గడ్ మండలం ఉప్పుగల్ గ్రామంలో ఆంజనేయ స్వామి ఆలయ పునర్ నిర్మాణానికి మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి భూమి పూజ చేశారు.

ఈ సందర్బంగా ఆలయ అర్చకులు నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీహరి మాట్లాడుతూ.. ఉప్పుగల్ గ్రామ ప్రజలందరూ ఐక్యంగా ముందుకు వచ్చి ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణం చేస్తున్న గ్రామ ప్రజలకు, సహకారం అందిస్తున్న దాతలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆంజనేయ స్వామి ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో జీవించాలని ప్రార్థించారు. ఉప్పుగల్ గ్రామ ప్రజల ఆశీర్వాదంతో 30ఏళ్లుగా రాజకీయాలలో కొనసాగుతున్నానని, ఆలయ నిర్మాణానికి తన వంతు సహాయంగా లక్ష రూపాయలు విరాళంగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply