Bhimgal l భీంగల్ ను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తా…

Bhimgal l భీంగల్ ను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తా…
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి
పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
Bhimgal l భీంగల్ టౌన్, ఆంధ్రప్రభ; 10 సంవత్సరాల బీఆర్ఎస్ హయాంలో అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిన భీంగల్ పట్టణాన్ని కాంగ్రెస్ పార్టీ దత్తత తీసుకొని అభివృద్ధి బాధ్యతను ఇక్కడి ప్రాంత వ్యక్తిగా తనే తీసుకుంటానని పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. మున్సిపల్ ఎన్నికలలో భాగంగా భీంగల్ పట్టణ కేంద్రంలో ఖనిజాభివృద్ధి శాఖ, కో-ఆపరేటివ్, సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్లు ఈరావత్రి అనిల్, మానాల మోహన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి, డిసిసి అధ్యక్షుడు నగేష్ రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జ్ ముత్యాల సునీల్ కుమార్, మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి గాలి అనిల్ కుమార్, కాంగ్రెస్ మున్సిపల్ అభ్యర్థుల తో కలసి ప్రచారం నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్రాన్ని కెసిఆర్ వల్లకాడులా మార్చాడని కాని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల లోనే ఇచ్చిన హామీల మేరకు గృహ నివాసలకు ఉచిత కరెంటు, ఉచిత బస్సు, పేదలందరికీ తెల్ల రేషన్ కార్డు, స్థలం ఉండి ఇండ్లు లేనివారికి ఇందిరమ్మ ఇండ్లు, రైతులకు రైతు భరోసా, రుణమాఫీ వంటి సంక్షేమ ఫలాలను అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని మహేష్ కూమార్ అన్నారు. ఇక్కడి ప్రాంత వ్యక్తిగా తను ఇక్కడ అభివృద్ధి ధ్యేయంగా ఈ గ్రేటెడ్ పాఠశాల కోసం 6 కోట్ల విలువైన తన సొంత భూమిని ప్రభుత్వానికి ఇచ్చానన్నారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భీమ్గల్ పట్టణాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి బాధ్యత తీసుకుంటానని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు. వంద పడకల ఆసుపత్రికి ఐదు కోట్ల మంజూరు చేసి మూడు నెలల్లో పూర్తిచేసి ప్రజలందరికీ వైద్య సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తామన్నారు.
360 కోట్ల నిధులతో ధర్మపురి నుండి కొండగట్టు, వేములవాడ, మీదుగా రుద్రంగి మానాల రహత్ నగర్ లేవనే గ్రామాలను కలుపుతూ లింబాద్రిగుట్ట వరకు అక్కడినుండి భీంగల్ నుండి రింగ్ రోడ్డు ద్వారా ఆర్మూర్ మీదుగా బాసర వరకు పెద్ద కారిడార్ ( నాలుగు లైన్ల రోడ్డు) నిర్మించనున్నామని ఎందుకు టెండర్లు కూడా పిలిచామని పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని తెలిపారు. అలాగే తన సొంత గ్రామమైన రహత్ నగర్ లో ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వానికి ఆరు కోట్ల భూమిని ఉచితంగా ఇచ్చానని తెలిపారు. అలాగే జిల్లాకు ఇంజనీరింగ్ కళాశాల తోపాటు రాష్ట్రవ్యాప్తంగా 3 వ్యవసాయ కళాశాలలను మంజూరు చేయించాను అన్నారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన లింబాద్రిగుట్టకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ఎండోమెంట్ ద్వారా 8 కోట్లతో గెస్ట్ హౌస్ నిర్మాణం చేపట్టనున్నామని పనులు కూడా త్వరలోనే ప్రారంభమవుతాయి అన్నారు. అభివృద్ధి అధికార పార్టీతోనే అని కనుక కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అభ్యర్థులను 12 వార్డులలో గెలిపించి ఈ గడ్డను కాంగ్రెస్ అడ్డగా నిలపాలని కోరారు.
పీసీసీ కి ఘన స్వాగతం:
మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు సబ్ స్టేషన్ వద్ద మహేష్ కుమార్ గౌడ్ కు స్వాగతం పలికారు. నంది గల్లి వద్ద ఏర్పాటు చేసిన సమావేశం వద్ద భారీ పూలమాల వేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
