Bhimavaram Bulls | కెప్టెన్‌గా నితీశ్ కుమార్ రెడ్డి

భీమవరం : టీమిండియా ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) భీమవరం బుల్స్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. వచ్చే నెల 8వ తేదీ నుంచి జరగబోయే ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) (APL) లో ఆయన సారథ్య బాధ్యతలు చేపడతాడు. ఈ విషయాన్ని భీమవరం బుల్స్ ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది. ఇటీవల వైజాగ్ (Vizag) లో జరిగిన టోర్నీ వేలంలో నితీశ్‌ను ఈ ఫ్రాంచైజీ రూ.10 లక్షలకు కొనుగోలు చేసింది.
కాగా, ప్రస్తుతం నితీశ్ కుమార్ ఇంగ్లండ్‌లో టెస్ట్ సిరీస్ (England Test series) ఆడుతున్న భారత జట్టులో సభ్యుడు అన్న విషయం తెలిసిందే. ఈ సిరీస్ ఆగస్టు 4న ముగుస్తుంది. ఆ తర్వాత ఏపీఎల్‌లో ఆడతాడు. ఏపీఎల్ నాలుగో సీజన్ ఆగస్టు 8న ప్రారంభం కానుంది. ఆగస్టు 24న టోర్నీ ముగుస్తుంది. ఈసారి లీగ్‌లో ఏడు జట్లు బరిలోకి దిగుతున్నాయి. భీమవరం బుల్స్, అమరావతి రాయల్స్, కాకినాడ కింగ్స్, రాయల్స్ ఆఫ్ రాయలసీమ, సింహాద్రి వైజాగ్ లయన్స్, తుంగభద్ర వారియర్స్, విజయవాడ సన్‌షైనర్స్ జట్లు పాల్గొంటున్నాయి. అన్ని మ్యాచులు విశాఖపట్నంలోనే జరుగుతాయి.
