Bheemgal | చెక్కులను పంపిణీ చేయండి

Bheemgal | చెక్కులను పంపిణీ చేయండి
Bheemgal | భీంగల్ టౌన్, ఆంధ్రప్రభ : ఇటీవల బాల్కొండ నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకం ద్వారా మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హాజరు కాని కొందరు లబ్ధిదారులు చెక్కులు తీసుకోలేదు. అలాంటి వారి చెక్కులను తహసీల్దార్ ద్వారా కానీ, గ్రామస్తాయి అధికారుల ద్వారా కానీ పంపిణీ చేయాలని భీంగల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బోదిరే స్వామి డిమాండ్ చేశారు.
ఇవాళ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. వచ్చిన చెక్కులు లబ్ధిదారులకు తన ఆదేశాలు వచ్చే వరకు ఇవ్వకుండా ఉంచాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించడం సమంజసం కాదన్నారు. ఇప్పటికైనా మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేయాలని, లేకుంటే ఎమ్మెల్యే ఇంటి ముందు లబ్ధిదారులతో ఆందోళన కార్యక్రమం చేస్తామని హెచ్చరించారు.
