Bheemgal | గిరిజనులు రాజకీయంగా ఎదగాలి

Bheemgal | గిరిజనులు రాజకీయంగా ఎదగాలి
Bheemgal | భీమ్‌గల్ టౌన్, ఆంధ్రప్రభ : గిరిజన నాయకులు రాజకీయంగా అభివృద్ధి చెందడానికి కృషి చేయాలని జిల్లా బంజారా సేవ సంఘం గౌరవ అధ్యక్షులు భూక్యా చంద్రునాయక్, మున్సిపల్ (Muncipal) శాఖ రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ మాలోత్ నరహరి నాయక్, జిల్లా బంజారాసేవ సంగ్ అధ్యక్షులు మూడ్ బాబురామ్ నాయక్ సూచించారు. ఇవాళ పట్టణంలోని బంజారా భవన్ లో బంజారాసేవ సంఘం మండల శాఖ ఆధ్వర్యంలో బాధవత్ శర్మ నాయక్ అధ్యక్షతన ఇటీవల ఎన్నికల్లో విజయం సాధించిన సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డ్ సభ్యులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి వారు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. బంజారా జాతి గౌరవం పెంచేలా రాజకీయాలు చేయాలని సూచించారు. గిరిజన నాయకులకు, ప్రజలకు ఎలాంటి సమస్యలు వచ్చినా.. పార్టీలకు అతీతంగా ఐకమత్యంతో పోరాడాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో (Election) విజయం సాధించిన వారిని అభినందించడంతో పాటు పూలమాల, శాలువాతో సత్కరించారు. జాతి గౌరవం పెంచడంతో పాటు గిరిజన గ్రామపంచాయతీల అభివృద్ధికి పాటుపడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బంజారాసేవ సంఘ్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ బాధవత్ గోపాల్ నాయక్, తుక్కాజీ నాయక్, బోర్ లింగం, మాలవత్ వెంకటేష్, గోవింద్ నాయక్, రాజు నాయక్, సంగ్యా నాయక్, బాబూలాల్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.
