TG | కేంద్ర ఆర్ధిక మంత్రితో రాష్ట్ర ఆర్ధిక మంత్రి భేటీ..

  • రాష్ట్రానికి రావాల్సిన నిధుల‌పై విజ్ఞప్తి

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా వివిధ అంశాలు, శాఖల్లో రాష్ట్రానికి రావాల్సిన నిధులపై భట్టి విక్రమార్క కేంద్ర ఆర్థిక మంత్రికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులను త్వరగా అందించాలని కోరారు.

భట్టి విక్రమార్క నిధులు కోరిన ప్రాజెక్టులు..

  • వివిధ కార్పొరేషన్‌లు/ ఎస్పీవీ ల రుణ పునర్వ్యవస్థీకరణ చేపట్టాల్సిందిగా కోరిన భట్టి విక్రమార్క.. ఆర్థిక సంస్థలకు మార్గదర్శకాలు జారీ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
  • తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.408 కోట్ల పైచిలుకు నిధుల గురించి చర్చించిన రాష్ట్ర ఆర్థిక మంత్రి.. త్వరగా తిరిగి చెల్లింపులు చేయాలని కోరారు.
  • ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం- 2014 , కేటగిరి 94(2) ప్రకారం.. వెనుకబడిన జిల్లాల ప్రత్యేక సహాయ నిధిని త్వరగా విడుదల చేయాలని కోరారు.
  • 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి.. కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల విడుదలలో జరిగిన కేటాయింపు పొరపాట్లను సరిచేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ పొరబాటు కారణంగా తెలంగాణకు నష్టం కలుగుతుందని తెలిపారు.
  • ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం – 2014 లోని విభాగం 56(2) ప్రకారం రూ. 208.24 కోట్లు తిరిగి చెల్లించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను విజ్ఞప్తి చేశారు.
  • ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి తెలంగాణ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు కేటాయించిన అదనపు బాద్యత మేరకు.. రాష్ట్ర సంస్థకు రావాల్సిన నిధుల విషయమై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ నిధుల్ని తెలంగాణ సంస్థకు త్వరగా అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. అలాగే.. కేంద్రం చేయాల్సిన నిధుల బదిలీ గురించి చర్చించారు.
  • ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పవర్ యుటిలిటీల మధ్య పెండింగ్‌లో ఉన్న బకాయిల పరిష్కారం చేయాలని కోరారు.

డిప్యూటీ సీఎం వెంట స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్, ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, బలరాం నాయక్ తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *