Bhagyashree | మరో ఛాన్స్ దక్కిందా..?

Bhagyashree | మరో ఛాన్స్ దక్కిందా..?

Bhagyashree | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : భాగ్యశ్రీ బోర్సే.. ఇప్పుడు టాలీవుడ్ లో బాగా వినిపిస్తున్న పేరు ఇది. ఈ అమ్మడి సినిమాలు అంతగా ఆడకపోయినా.. వరుసగా ఆఫర్స్ దక్కించుకోవడం విశేషం. ఇప్పుడు లెనిన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. అయితే.. ఈ సినిమా రిలీజ్ కాలేదు. ఇప్పుడు బంపర్ ఆఫర్స్ సొంతం చేసుకుందని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ.. భాగ్యశ్రీ దక్కిన ఆ బంపర్ ఆఫర్స్ ఏంటి..?

భాగ్యశ్రీ బోర్సే మాస్ మహారాజా రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ మూవీతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. అందం, అభినయంతో ఆకట్టుకుంది.. మంచి డ్యాన్సర్ అనే పేరు తెచ్చుకుంది. అయితే.. తొలి సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేదు. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయ్యింది. అయినప్పటికీ.. కింగ్ డమ్, కాంత, ఆంధ్రాకింగ్ చిత్రాల్లో నటించింది.

Bhagyashree |

ఈ సినిమాల్లో కింగ్ డమ్ డిజాస్టర్ అయ్యింది. కాంత సినిమాలో నటిగా మంచి పేరు తెచ్చుకుంది కానీ.. ఈ మూవీ కూడా బాక్సాఫీస్ దగ్గర నిరాశ పరిచింది. ఇక ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా మంచి టాక్ వచ్చినా కలెక్షన్స్ మాత్రం రాబట్టలేకపోయింది. జస్ట్ యావరేజ్ గా నిలిచింది.

Bhagyashree |

ఇలా భాగ్యశ్రీ నటించిన సినిమాలు ప్లాప్ అవుతున్నా.. అవకాశాలు మాత్రం ఆగడం లేదు. ఇప్పుడు అక్కినేని అఖిల్ కి జంటగా లెనిన్ మూవీలో నటిస్తుంది. మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ లో అఖిల్ కి జంటగా భాగ్యశ్రీ అదిరింది అనే కామెంట్లు వచ్చాయి. మే 1న ఈ సినిమా రిలీజ్ చేయాలి అనుకుంటున్నారు కానీ.. పోస్ట్ పోన్ అంటూ వార్తలు వస్తున్నాయి. త్వరలో లెనిన్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు.

Bhagyashree |

ఇప్పుడు కోలీవుడ్ లో శివ కార్తికేయన్ కు జంటగా నటించే ఛాన్స్ దక్కించుకుందట. కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్ కు జంటగా భాగ్యశ్రీ నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అలాగే సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించే సినిమా కోసం కూడా భాగ్యశ్రీని ఫైనల్ చేయనున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. సో.. ప్లాపులు వస్తున్నా.. ఇప్పుడు రెండు క్రేజీ సినిమాల్లో ఆఫర్స్ రావడం అంటే.. భాగ్యశ్రీకి బంపర్ ఆఫరే.

click here to read more : 100 crores | మాటల వెనుక మర్మం ఏంటి..?

click here to read more

Leave a Reply