హైదరాబాదు: భాగ్యనగరం అంతర్జాతీయ డెంటిస్ట్రీలో గుర్తింపు పొందుతున్నది. సెర్బియాలోని నోవిసాద్‌లో సెర్బియన్ డెంటల్ ఇంప్లాంట్ కాంగ్రెస్-2025 సదస్సుకు భారతదేశం నుంచి ఏకైక ప్రతినిధిగా హైదరాబాదుకు చెందిన ప్రముఖ డెంటల్ డాక్టర్ వికాస్ గౌడ్ హాజరయ్యారు.
ఆ సదస్సులో ఆయన ప్రముఖ అతిధిగా హాజరై కీలకోపన్యాసం ఇచ్చారు. టిష్యూ ఆగ్‌మెంటేషన్‌లో పదిహేనేళ్ల అనుభవాన్ని అంతర్జాతీయ ప్రముఖ డాక్టర్లతో పంచుకునే అవకాశం కలిగినట్టు డాక్టర్ వికాస్ గౌడ్ వెల్లడించారు. ఇంప్లాంటాలజీలో స్కూల్ ఆఫ్ డెంటల్ ఇంప్లాంట్స్‌లో అంతర్జాతీయ విద్యార్ధులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు.