Bhagavatgita | గీతాసారం ఆధ్యాయం 6, శ్లోకం 33

గీతాసారం ఆధ్యాయం 6, శ్లోకం 33

అర్జున ఉవాచ
యోమం యోగస్త్వయా ప్రోక్త:
సామ్యేన మధుసూధన |
ఏతస్యాహం న పశ్యామి
చంచలత్వాత్‌ స్థితిం స్థిరామ్‌ ||

తాత్పర్యము : అర్జునుడు పలికెను : ఓ మధుసూదనా! మనస్సు చంచలనమును మరియు అస్థిరమును అయియున్నందున నీవు సంగ్రహముగా తెలిపినటువంటి యోగపద్ధతి ఆచరణకు ఆసాధ్యమైనదిగను మరియు ఓర్వరానిదిగను నాకు తోచుచున్నది.

భాష్యము : అర్జునుడు, శ్రీకృష్ణుడు వివరించిన యోగా పద్ధతిని పాటించుట తన వల్ల కాదని తిరస్కరించిన నాడు దానిని పాటించవలెనంటే నిర్ధిష్టమైన జీవనశైలి, స్థిర ఆసనము, నిశ్చలమైన ప్రదేశము, భౌతిక బంధనములను వీడిన ఏకాగ్ర మనస్సు అవసరము. ఐదు వేల సంవత్సరముల క్రితము రాజవంశీయుడు, తేజోవంతుడు, గొప్ప విలుకాడు, అన్నింటికీ మించి శ్రీకృష్ణుని ప్రియమిత్రుడు అయిన అర్జునిడికే ఇటువంటి యోగాభ్యాసము సాధ్యము కాలేదంటే ఇక జీవిత సంఘర్షణలో తలమునకలై ఉన్న నేటి కలియుగ వాసులకు ఇది సాధ్యమేనా! నూటికో కోటికో ఎవరో ఒకరికి సాధ్యమనుకున్న ఇది సర్వసాధారణము కాదు. నేడు ‘యోగ’ పేరుతో ఎన్నో సంస్థలు దాని లక్ష్యమైన భగవధ్యానాన్ని విడనాడి వారి సమయాన్ని వృధా చేస్తున్నారు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Leave a Reply