భగత్ సింగ్ ఆశయాలను నెరవేర్చాలి..

పరకాల, ఆంధ్రప్రభ : పరకాల పట్టణంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో భగత్ సింగ్ వర్ధంతి కార్యక్రమం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సోమవారం రోజు ఎస్ఎఫ్ఐ పరకాల మండల అధ్యక్షుడు మడికొండ ప్రశాంత్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్ విచ్చేసి మాట్లాడుతూ.. దేశ స్వతంత్రం కోసం తమ నవ యవ్వన జీవితాన్ని సైతం త్యాగం చేసిన భగత్ సింగ్ రాజ్ గురు సుఖదేవుల స్ఫూర్తితో విద్యార్థులు చదువులో రాణించాలన్నారు.

సమాజ రుగ్మతలు సమస్యలపై పోరాడాలని అన్నారు. వారు తృణప్రాయంగా తమ ప్రాణాలను వదిలారని బ్రిటిష్ వలసవాదానికి వ్యతిరేకంగా వారి పోరాటమే మనకు స్ఫూర్తిదాయకమని, మనస్పూర్తితో పెట్టుబడిదారీ విధానాలకు విద్యా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విద్యార్థులంతా ఏకమై పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ బాలుర పాఠశాల ప్రధానోపాధ్యాయులు సురేందర్,
ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply