Bhadrachalam | మీడియాపై ఆంక్షలు – విపక్ష నేతల అరెస్ట్ లు

పినపాక / బూర్గంపాడు, ఏప్రిల్ 6, (ఆంధ్రప్రభ న్యూస్ ): భద్రాచలం సీతారామచంద్ర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. ఇదే నేపద్యంలో బూర్గంపాడు,భద్రాచలం పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎక్కడ చూసినా పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మరో కొద్ది క్షణాల్లో సీఎం రేవంత్ రెడ్డి భద్రాచలం చేరుకోనున్నారు. సారపాక ఐటిసి బిపిఎల్ స్కూల్ ప్రాంగణంలో హెలి ఫ్యాడ్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. సీఎం రేవంత్ రెడ్డి కార్యక్రమాన్ని కవర్ చేసేందుకు వెళుతున్న జర్నలిస్టులను పోలీసులు సైతం ఆంక్షలు విధిస్తూ నో పర్మిషన్ అంటూ వెనక్కి తిప్పి పంపుతున్నారు.

డిపిఆర్ఓ అందించిన వంటి జర్నలిస్టులకు మీడియా పాసులను కూడా తిరస్కరిస్తూ ప్రవర్తిస్తున్నారు. సారపాక గ్రామంలోని బూరం శ్రీనివాస్ ఇంటి వద్ద కూడా పోలీసులు ఆంక్షలు విధిస్తూ జర్నలిస్టులను అడ్డుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కార్యక్రమం పై పోలీసుల ఆంక్షలు విధించడంతో ఇదెక్కడ చోద్యం అంటూ జర్నలిస్టులో విమర్శలు వెల్లువెత్తుతున్నారు.

సీఎం రాకతో..ప్రతిపక్ష నాయకులు ముందస్తు అరెస్టు…

బూర్గంపాడు (ఆంధ్రప్రభ): భద్రాచలం సీతారాముడి కళ్యాణ వేడుకలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టు వస్త్రాలు తో రానున్నారు. తిరుగు ప్రయాణంలో బూర్గంపాడు మండలం సారపాక గ్రామంలోని ఓ గిరిజన కుటుంబానికి చెందిన బూరం శ్రీనివాస్ ఇంటికి వెళ్లి సాధారణ భోజనం స్వీకరించనున్న నేపథ్యంలో ప్రతిపక్ష నాయకులు అడ్డు పడే అవకాశాలు ఉన్నందున శనివారం రాత్రి ముందస్తుగా అరెస్టు చేశారు.

ఎన్నికల ఇచ్చిన హామీలు అమలు విషయంలో సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రతిపక్ష నాయకులను ముందస్తు అరెస్టు చేసి పాల్వంచ రూరల్ కిన్నెరసాని పోలీస్ స్టేషన్ కి తరలించారు. అరెస్టు కాపాడిన ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతూ అర్ధరాత్రి వేళ ఇంటికి వచ్చి అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని ఎప్పుడూ లేని విధంగా తామనీ స్టేషన్ స్టేషన్ మార్చుకుంటూ పాల్వంచ మండలం రూరల్ పోలీస్ స్టేషన్ అయినా కిన్నారసాని పోలీస్ స్టేషన్ తరలించడం హేమమైన చర్య అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

అరెస్ట్ అయిన వారిలో బూర్గంపాడు మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గోపిరెడ్డి రమణారెడ్డి, సారపాక టౌన్ అధ్యక్షులు కొనకంచి శ్రీనివాస్, యూత్ నాయకులు చైతన్య రెడ్డి, చల్ల కోటి పూర్ణచంద్రరావు, సురేష్, చారి తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *