Bhadrachalam | ముక్కోటి ఏకాద‌శికి ఆల‌యాలు ముస్తాబు

Bhadrachalam | ముక్కోటి ఏకాద‌శికి ఆల‌యాలు ముస్తాబు

  • ఉత్త‌ర ద్వార ద‌ర్శ‌నానికి భ‌ద్రాద్రి సీతారామాల‌యం సిద్ధం
  • భ‌ద్రాచ‌లం చేరుకుంటున్న భ‌క్తులు.. ఆద్యాత్మిక సంత‌రించుకున్న‌ద‌క్షిణ అయోధ్య‌
  • యాదాద్రి శ్రీ‌ల‌క్ష్మీన‌ర‌సింహ స్వామి ఆల‌యంలో ప‌క‌డ్బందీ ఏర్పాట్లు
  • ఆల‌యాల వ‌ద్ద భారీ పోలీసు బందోబ‌స్తు
  • గ‌వ‌ర్న‌ర్‌ను ఆహ్వానించిన యాదాద్రి ఆల‌య అధికారులు

Bhadrachalam | భద్రాచలం, యాద‌గిరి కొండ‌, ఆంధ్రప్రభ : ముక్కోటి ఏకాద‌శికి రాష్ట్రంలో ఆల‌యాలు ముస్తాబు అవుతున్నాయి. భద్రగిరి వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉత్తర ద్వారదర్శనం కోసం ఆల‌య ఉత్త‌ర ద్వారం సిద్ధం చేశారు. భద్రాచలం (Bhadrachalam)లోని దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన రామాలయం విద్యుత్ కాంతులతో దేదీప్యమానంగా ఉంది.

ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారిని తిలకించేందుకు దేశం నలుమూలల నుంచి రామ భక్తులు భద్రాచలం చేరుకున్నారు. దీనితో పట్టణంతో పాటు, ఆలయ చుట్టుపక్కల ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. సుమారు లక్ష మంది భక్తులు(one lakh devotees) ఉత్సవాలను తిలకించేందుకు వస్తారనే అంచనాతో ఆలయ అధికారులు సిద్ధంగా ఉన్నారు.

Bhadrachalam |

సోమవారం సాయంత్రం గోదావరిలో శ్రీ సీతారామచంద్రమూర్తి, లక్ష్మణ స్వామి, ఆంజనేయ స్వామి వారితో కలిసి హంసావాహనంపై తెప్పోత్సవం సందర్భంగా భక్తులకు దర్శనమిస్తారు. యావత్ ప్రజానీకం, ముక్కోటి దేవతలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వైకుంఠ ఉత్తరద్వార దర్శనం అంగరంగ వైభవంగా మంగళవారం ఉదయం జరగనున్నాయి.

కలెక్టర్ జితేశ్ వి పాటిల్(Collector Jitesh V Patil) ఆధ్వర్యంలో ముక్కోటికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తుల కోసం జిల్లా యంత్రాంగం ఆంజనేయస్వామి విగ్రహం, ఆర్టీసీ బస్టాండ్, విస్తా కాంప్లెక్స్, గోదావరి ఘాట్, కల్యాణ మండపం, ఆలయ ప్రాంగణం తదితర ప్రాంతాల వద్ద ప్రథమ చికిత్స కేంద్రాలతో పాటు అత్యవసర వైద్యం కోసం అంబులెన్స్(ambulance), ఏరియా ఆస్పత్రిలో ప్రత్యేక బెడ్లు, వైద్యనిపుణులను ఏర్పాటు చేశారు.

Bhadrachalam |

పంచాయతీ సిబ్బంది ఆధ్వర్యంలో అన్ని ప్రధాన కూడలిలో తాగునీటి వసతి కల్పించారు. పంచాయితీ సిబ్బందిని పట్టణ, ఇతర శుభ్రత కోసం అందుబాటులో ఉంచారు. గోదావరి స్నానాల ఘాటు వద్ద భక్తులు నదిలోకి దిగకుండా బారికేడ్లు నిర్మించారు. గజ ఈతగాళ్ళు అందుబాటులో ఉన్నారు. నది తీరంలో పడవలతో, లైఫ్ జాకెట్లు(life jackets), రక్షణ కవచాలు, రెస్క్యూ టీమ్తో పహరా అందిస్తుంది. అనేక ప్రాంతాల్లో దేవస్థానం ప్రసాదాల కౌంటర్లను ఏర్పాటు చేసింది. భక్తులకు ప్రసాదం సత్వరం అందేలా చర్యలు తీసుకుంటున్నారు.

Bhadrachalam |

వీఐపీలకు మిథిలా స్టేడియం వెనక, భక్తులకు పలు చోట్ల పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశారు. ఆంజనేయస్వామి విగ్రహం, బస్టాండ్,తానీషా కల్యాణ మండపం, ఇందిరాగాంధీ విగ్రహం వద్ద సమాచార కేంద్రాలు ఉన్నాయి. ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎస్పీ రోహిత్ రాజ్(SP Rohit Raj) ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేయగా భద్రాచల పట్టణం పోలీసుల పహారాలో ఉంది.

సుమారు 800 మంది సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తున్నారు. డాగ్, బాంబ్ స్క్వాడ్(bomb squad)లు తనిఖీలు చేస్తున్నాయి. వీవీఐపీలు, వీఐపీలు వచ్చినప్పుడు, స్వామి తిరువీధి సేవకు వెళ్లేటప్పుడు భక్తుల రద్దీని నియంత్రించేందుకు రోప్ టీమ్లను సిద్ధం చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పోలీసులకు డ్యూటీలు కేటాయిస్తున్నారు. తెప్పోత్సవం సందర్భంగా విహార నౌకపై
తనిఖీలు సైతం నిర్వహించారు.

Bhadrachalam | యాద‌గిరి గుట్ట‌లో…

యాదాద్రి పుణ్యక్షేత్రంలో మంగళవారం నిర్వహించనున్న ముక్కోటి (వైకుంఠ) ఏకాదశి పర్వదినం కోసం దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఈ సంద‌ర్భంగా ఆల‌యాన్ని సుంద‌రంగా ముస్తాబు చేశారు. భక్తులకు ఉత్తర రాజగోపురం ద్వారా దర్శనమివ్వనున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆ రోజు ఆలయ సమయాల్లో(temple timings) పలు మార్పులు చేసినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.

మంగ‌ళ‌వారం తెల్ల‌వారు జామున రెండు గంట‌ల‌కు ఆలయ తలుపులు తెరుస్తారు. అనంతరం 2:30 వరకు సుప్రభాత సేవ, నిత్యారాధనలు నిర్వహిస్తారు. అత్యంత ప్రధానమైన ఉత్తర ద్వార దర్శనం ఉదయం 5:30 గంటల నుండి 6:30 గంటల వరకు కొనసాగుతుంది.

Bhadrachalam | భక్తులకు ఉచిత బస్సు సౌకర్యం..

Bhadrachalam |

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానంలో ఈ నెల 30వ తేదీ మంగళవారం ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు(temple officials) వెల్లడించారు. తెల్లవారు జామున 3:30 గంటల నుండి గరుడ వాహన సేవ పూర్తయ్యే వరకు కొండ కింద ఉన్న వైకుంఠ ద్వారం (రింగ్ రోడ్డు) నుండి కొండపైకి భక్తులను ఉచితంగా చేరవేసేందుకు ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచారు.

స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు, స్థానికులు ఈ ఉచిత రవాణా సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా రద్దీని దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకున్నామని, అందరూ సహకరించాలని కార్యనిర్వహణాధికారి ఎస్. వెంకటరావు ఒక ప్రకటనలో కోరారు.

Bhadrachalam | గవర్నర్ ను ఆహ్వానించిన యాదగిరి దేవస్థాన అధికారులు..

Bhadrachalam |

యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానంలో అత్యంత వైభవోపేతంగా నిర్వహించ తలపెట్టిన వైకుంఠ ఏకాదశి మహోత్సవాలు , అధ్యయనోత్సవాలకు రావాల‌ని రాష్ట్ర గవర్నర్ గౌరవ జిష్ణు దేవ్ వర్మ కి ఆల‌య అధికారులు ఆహ్వానించారు. మంగ‌ళ‌వారం స్వామివారి ఉత్తర ద్వార దర్శనానికి విచ్చేయాలని కోరుతూ ఆలయ కార్యనిర్వాహణాధికారి(executive officer) ఎస్. వెంకటరావు రాజ్‌భవన్‌లో గవర్నర్ ని కలిసి ఆహ్వాన పత్రికను సమర్పించారు.

ఆయ‌న‌తోపాటు ఆలయ ప్రధాన అర్చకులు కాండూరి వెంకటాచార్యులు, ఉప ప్రధాన అర్చకులు మాధవాచార్యులు, ఆల‌య అర్చక బృందం గవర్నర్ ని వేద మంత్రోచ్ఛారణల మధ్య ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం గ‌వ‌ర్న‌ర్‌కు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ ఆహ్వాన కార్యక్రమంలో దేవస్థాన అధికారి వివేక్ తో పాటు ఇతర సిబ్బంది కూడా పాల్గొన్నారు. వైకుంఠ ఏకాదశి వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను ఈ సందర్భంగా అధికారులు గవర్నర్ జిష్ణుదేవ్ వ‌ర్మ‌కు వివరించారు.

Bhadrachalam |

CLICK HERE TO READ MORE : ప‌సిడి ప్రియుల‌కు శుభ‌వార్త‌…

CLICK HERE TO READ MORE :

Leave a Reply