హైదరాబాద్, ఆంధ్రప్రభ : నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్(NAC)ను అత్యుత్తమ స్కిల్ డెవల్మపెంట్(Skill Development) వేదికగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి, న్యాక్ వైస్ చైర్మన్ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి చేస్తున్న కృషికి ఫలితం దక్కుతోంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) సూచనల మేరకు విద్యార్థుల్లో స్కిల్ డెవలప్‌మెంట్ పెంపొందించాలనే లక్ష్యంతో ఇప్పటికే ప్రజా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేస్తుంది.
అందులో భాగంగా హైదరాబాద్ వేదికగా జిల్లాల్లో న్యాక్ ద్వారా శిక్షణ ఇవ్వడమే కాకుండా 100 శాతం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా NAC వైస్ ఛైర్మన్, మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి(Komati Reddy Venkat Reddy) ప్రత్యేక దృష్టి సారించారు. ఉత్తమ ఫలితాలు రాబట్టేందుకు మంత్రి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు.
టీచర్స్ డేను పురస్కరించుకొని న్యాక్ ట్రైనర్ స్నేహలత(Trainer Snehalatha)కు రాష్ట్ర పతి చేతుల మీదుగా జాతీయ అవార్డు రావడం పట్ల మంత్రి తన హర్షం వ్యక్తం చేశారు.
మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ఎంటర్ ప్రెన్యూర్షిప్(Entrepreneurship) విభాగంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఢిల్లీలో జాతీయ ఉత్తమ టీచర్స్ అవార్డు అందుకున్నన్యాక్ ట్రైనర్ స్నేహలతకు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.
ఆమె న్యాక్ ద్వారా నిరుద్యోగ యువతలో నైపుణ్యం(Skill) పెంపొందించేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లా, కరీంనగర్, జగిత్యాల పట్టణాల్లో నిరుద్యోగ యువతకు సర్టిఫికెట్ కోర్సులు, ఉద్యోగ అవకాశాలు కల్పించే వృత్తివిద్యా కోర్సులను అందిస్తూ, ఉత్తమ బోధన అందించేందుకు చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డు దక్కిందని కొనియాడారు.
దేశ వ్యాప్తంగా 13 మంది ఈ వార్డుకు ఎంపికైతే తెలంగాణ నుండి న్యాక్ ఇన్ స్ట్రక్టర్(NAAC Instructor)గా బాధ్యతలు నిర్వహిస్తున్నహన్మకొండకు చెందిన నక్క స్నేహలతకు అవార్డు రావడం తెలంగాణ రాష్ట్రానికి గర్వ కారణమన్నారు.
నైపుణ్యాలకు ఉత్తమ వేదికగా నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్‌ను బలోపేతం చేస్తున్నామని పేర్కొన్నమంత్రి, ప్రతిష్టాత్మక జాతీయ అవార్డు దక్కడంతో న్యాక్ ఫ్యాకల్టీ, సిబ్బందిలో మరింత ఉత్సాహాన్నినింపిందన్నారు. రాష్ట్ర పతి చేతుల మీదుగా అవార్డు అందుకున్నస్నేహలతకు(Snehalatha) న్యాక్ డైరెక్టర్ జనరల్(డీజీ), ప్రభుత్వ స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్ అభినందనలు తెలిపారు.
